13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన కుటుంబాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని హుస్నాబాద్ పట్టణంలోని 13వ వార్డులో ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో గోదాం గడ్డ బస్తీ దవాఖానలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి బీమా కల్పించడం ద్వారా అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులు పథకంలో నమోదు చేసుకోవచ్చన్నారు.

13వ వార్డు పరిధిలోని అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఉన్నట్లయితే), మొబైల్ నంబరు, నామినీ వివరాలు తీసుకురావాలని సూచించారు. దరఖాస్తులో వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హులందరికీ పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన సహకారం అందిస్తామని శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *