మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజితనియామకంపై హర్షం.. కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నాయిని రజిత నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయిని రజిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మహిళా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తానని, మహిళా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని నాయిని రజిత పేర్కొన్నారు.



