
తూప్రాన్ లో మావోహిస్టు లేఖ కలకలం..
మున్సిపల్ కార్యాలయం గేటు కు హెచ్చరిక లేఖ,
ఉద్యమాన్ని అణిచివేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వానికి హెచ్చరిక.
సిద్దిపేట టైమ్స్, మనోహరాబాద్/తూప్రాన్ :-
తూప్రాన్ మున్సిపల్ లో లేఖ కలకలం రేపింది.సోమవారం మున్సిపల్ గేటుకు గుర్తుతెలియని దుండగులు ఎర్ర జెండా తో లేఖను అంటించారు. ఈ లేఖను ఏపీటిహెచ్ అలెగ్జాండర్ పేరుతో విడుదల చేశారు.లేఖ లో పదిమంది విప్లవ యోధులను ఉరిశిక్ష విధించడాన్ని కండించారు.ముఖ్యమంత్రి మేడారం పర్యటనలో ఉండగా మొదటి రేఖ విడుదల చేశామని, నేడు రెండవ లేక విడుదల చేశామని లేఖలో హెచ్చరించారు.ఉద్యమాన్ని అణిచివేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి అని లేఖ లో హెచ్చరించారు. పోలీసులు లేఖకు స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.



