హుస్నాబాద్ – భద్రాచలం, బాసర కు ఎక్సప్రెస్ బస్సు సర్వీసులు

హుస్నాబాద్ – భద్రాచలం, బాసర కు ఎక్సప్రెస్ బస్సు సర్వీసులు

రేపు హుస్నాబాద్ నుండి భద్రాచలం, బాసర కు ఎక్సప్రెస్ బస్సులు ప్రారంభం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త రేపటినుండి హుస్నాబాద్ నుండి బాసర మరియు భద్రాచలం పుణ్యక్షేత్రాలకు వెళ్ళుటకు రెండు ఎక్సప్రెస్ బస్సులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని హుస్నాబాద్ ప్రాంత ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలిపారు.

అలాగే హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు రేపు  ఉదయం 11:30 నుంచి 12:30 వరకు హుస్నాబాద్ డిపో మేనేజర్ డి సి హెచ్ వెంకటేశ్వర్లు డయల్ యూఆర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 7382852772 మొబైల్కి కాల్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.



      

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *