డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్

డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్

డీజేఎఫ్, జెపీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రమేష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;

డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ (జె. పి. ఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా దిశ దినపత్రిక హుస్నాబాద్ ఆర్.సి ఇన్చార్జి బోయిని రమేష్ ను నియమిస్తున్నట్లు డీజేఎఫ్ జె పి ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చింతకింది సింగరయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం నియామక పత్రం అందజేశారు. ఈ నియామకం పట్ల రమేష్ హర్షం వ్యక్తం చేస్తూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి , రాష్ట్ర అధ్యక్షులు మోట పలుకుల వెంకట్, డీజేఎఫ్ జేపీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చింతకింది సింగరయ్య కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి డీజేఎఫ్ జె పి ఎఫ్  జర్నలిస్టుల సమస్యలను ఎత్తిచూపడంలో తన వంతు పాత్ర పోషిస్తూ సంఘము యొక్క ఎదుగుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *