పోలీసు అత్యుత్సాహం..టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..

పోలీసు అత్యుత్సాహం..టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..

పోలీసు అత్యుత్సాహం..
టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..
రోడ్డు పైకి రావాలంటేనే జంకుతున్న రైతులు, గ్రామస్తులు
పోలీసుల  తీరు వట్ల స్థానికులు ఆగ్రహం..
సివిల్ డ్రెస్ లో సిబ్బంది… డ్రైవర్ చేతిలో లాఠీ….?

సిద్దిపేట టైమ్స్, మిరుదొడ్డి,

చట్టం ఎవరికీ చుట్టం కాదు… అలాగని అర్హత లేని వారు సైతం పై నిబంధన మరిచి పోయి అధికారుల మాదిరిగా విధులు నిర్వహించడం కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కిందకే వస్తుందనే విషయాన్ని గ్రహించని పలువురు పోలీస్ సిబ్బంది ప్రజలు, రైతుల పట్ల చూపిస్తున్న అత్యుత్సాహంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు, వాహన డ్రైవర్ లు సైతం పోలీస్ ఉన్నతాధికారుల వలె స్థానిక వాహనదారులను ఆపి వాహన ధృవ పత్రాలు, ఇతర డాక్యుమెంట్ల గురించి ఆరా తీసి లేని వాటి పట్ల ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మిరుదొడ్డి గ్రామ రైతులు, ప్రజలు వాపోతున్నారు. సాధారణంగా ప్రయాణికుల వాహనాలను ఆపి తనిఖీ చేయడానికి ఒక స్థాయి కలిగిన పోలీస్ అధికారులకు మాత్రమే అధికారం ఉంటుంది. అందులోనూ వారు వాహన చోదకులను ఒత్తిడికి గురి చేయడం, వారి వాహనానికి సంబంధించిన తాళంచెవిలను ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్కోవడానికి కూడా వీలు లేదు. కానీ ఇవేమీ లెక్క చేయకుండా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ వాహన డ్రైవర్ చేతిలో లాఠీ పట్టుకొని,  యూనిఫామ్ లేకుండానే వచ్చి పోయే వాహనదారుల వాహనాలు అపి వారిని తనిఖీ చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు. సోమవారం రోజున మిరుదొడ్డి గ్రామంలోని హనుమాన్ దేవాలయ సమీపంలో పై స్థాయి అధికారి లేకుండానే యూనిఫామ్ లేకుండా  చేతిలో లాఠీ పట్టుకొని వాహన డ్రైవర్ రోడ్డు పైకి వచ్చి అటుగా వెళ్లే వాహనదారులను అపి వారికి ఫైన్ వేయడం, లేదంటే వారి వాహనాలకు సంబంధించిన తాళం చెవిలను లాక్కోవడం చేయడంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా ఉండే వారు ఇతర ప్రాంతాలకు వెళ్తే తప్ప స్థానికంగా వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదనే విషయాన్ని స్వయంగా కోర్టులే నొక్కి చెప్పాయి. అంతేకాకుండా పొలం పనులపై వెళ్లే రైతులు సాధారణంగా హెల్మెట్ లేకుండానే తమ పొలాలకు వెళ్లి పనులు ముగించుకొని అలసిపోయి వస్తున్న తరుణంలో ఇలాంటి పోలీస్ సిబ్బంది వారిని డాక్యుమెంట్ ల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి ప్రయాణం చేసే వారిని ఆపి వారి గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవడానికి సదరు పోలీస్ అధికారులు వాహన తనిఖీ చేసి పలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది, లేని తరుణంలో తప్పనిసరి అయితే జరిమానా విధించాలి. కానీ వాహనాలను ఆపడానికి ఎలాంటి అధికారమూ లేనటువంటి కింది స్థాయి సిబ్బంది అందులోనూ సివిల్ డ్రెస్ లో ఉండడం, చేతిలో లాఠీ పట్టుకొని స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ, పొలం పనుల నుండి వస్తున్నామని చెబుతున్నా, మేము స్థానికులమే ఫలానా ప్రాంతం నుండి స్థానికంగానే వెళ్తున్నామని చెప్తున్నా వినకుండా తమ ఇష్టారీతిగా ట్యాబ్ లో ఫోటోలు తీస్తూ ఇదేంటని అడిగితే వాహనానికి సంబంధించిన తాళం చెవిని లాక్కోవడంతో పలువురు ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నత స్థాయి అధికారి అయినప్పటికీ వాహనదారుల నుండి తమ వాహనానికి సంబంధించిన తాళం చెవిని తీసుకునే అధికారం లేదనేది చట్టంలో ఉంది. అయినప్పటికీ దాన్ని తుంగలో తొక్కి కింది స్థాయి సిబ్బంధి అత్యుత్సాహం ప్రదర్శిండంతో మిరుదొడ్డి గ్రామస్తులు, రైతులు ఇంటి నుండి వాహనాలపై బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు చొరవ చూపి కింది స్థాయి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకొని తమకు ఉపశమనం కల్పించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *