Breaking: కాంగ్రెస్ MLA భార్య ఆత్మహత్య

Breaking: కాంగ్రెస్ MLA భార్య ఆత్మహత్య

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూప దేవి ఆత్మహత్య

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ MLA మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపా దేవి గురువారం సాయంత్రం  ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. అల్వాల్ లోని తన సొంత నివాసంలో రాత్రి 10:30 సమయంలో ఉరి వేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన కొంపల్లిలోని రెనో హాస్పిటల్ కు తరలించారు. వారికి 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల పాప ఉన్నారు. గతవారం తిరుపతి, కంచి, కాణిపాకం తోపాటు పలు పుణ్యక్షేత్రాలను ఐదు రోజులపాటు సందర్శించి వచ్చారు. ఇంతలోనే ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది.

2010 బ్యాచ్ కి చెందిన రూపాదేవి మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండల్ రావల్కోల్ గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మేడిపల్లి సత్యం రూపాదేవి 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

MLA  సత్యం భార్య మృతదేహాన్ని చూసిన వెంటనే స్పృహ తప్పిపడిపోయారు. వీరిది ప్రేమ వివాహం. నియోజకవర్గ పర్యటన లో వున్న సత్యం కు ఆత్మహత్య కు ముందు వీడియో కాల్ చేసి మాట్లాడిన భార్య. హుటాహుటిన ఇంటికి వచ్చిన సత్యం భార్య మృతదేహం చూసి కుప్పకూలిపోయారు. సూసైడ్‌కి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *