ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో రెండు పీజీ కోర్సులు మంజూరు…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో రెండు పీజీ కోర్సులు మంజూరు…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో రెండు పీజీ కోర్సులు మంజూరు…
మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సు ప్రారంభం..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.2కోట్ల 50లక్షలతో నిర్మించే 12 అదనపు తరగతి గదుల నిర్మాణం వెంటనే చేపట్టాలి..
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో మరో రెండు పీజీ కోర్స్ లు, అదేవిదంగా మిట్టపల్లి వద్ద ఉన్న మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఒక పీజీ కోర్సు ప్రారంభం అయినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ… సిద్దిపేట ప్రభుత్వ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే 10 కోర్సులతో పీజీ తరగతులు నడుస్తున్నాయి కొత్తగా మరో రెండు కోర్సు లు ఎమ్మెస్సి మైక్రో బయాలాజీ, ఎమ్మెస్సి కంప్యూటర్స్ 60 సిట్ల చొప్పున ఈ సంవత్సరం నుండి ప్రారంభం కానుందని తెలిపారు. అదేవిదంగా మిట్టపల్లి ప్రాంతంలో నడుస్తున్న మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల పీజీ కళాశాలగా అప్గ్రేడ్ తో ఒక పీజీ కోర్సు మంజూరు అయింది.ఎమ్మెస్సి పిజిక్స్ కోర్స్ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానుందని చెప్పారు. ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతి యువకులని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొరారు. సిద్దిపేట నియోజకవర్గం విద్యాలయాల నిలయం విరాజీళ్ళుతుంది.రెండు మెడికల్ కాలేజ్ లు, 4 పాలిటెక్నీక్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాల,ఫార్మసీ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేంద్రియ విద్యాలయం ఇలా ఎన్నో విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేట ఆదర్శం గా నిలుస్తుందన్నారు.సిద్దిపేట యువతి యువకులు, విద్యార్థులకు మంచి చదువు అందిచాల్లన్నదే తనా తపన వారిని విశ్వ విజేతలుగా తీర్చిదిద్దాలన్నదే తనా లక్ష్యం అని అన్నారు.డిగ్రీ కళాశాలలో రూ.2కోట్ల 50 లక్షలతో నిర్మించే 12 అదనపు తరగతుల గదుల నిర్మాణం వెంటనే చేపట్టాలని సంబందిత అధికారులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశించారు.పనుల జాప్యం ఫై ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులఫై హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.వేంటనే పనులు ప్రారంభించాలని కొరారు.సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో మరింత పురోభివృద్ధి సాధించేలా అటు విద్యా శాఖ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరి సమిష్టి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *