ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం..జిల్లా ఎస్పీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి

ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం..జిల్లా ఎస్పీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి

ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం..
జిల్లా ఎస్పీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి

సిద్దిపేట్ టైమ్స్, రామాయంపేట మే 11

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పోరేట్ ఆసుపత్రుల సహకారంతో పేదల ముంగిటికే ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి రాచకొండ కమిషనరేట్ డాక్టర్ నంద్యాల నరసింహారెడ్డి అన్నారు.
ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో కొంపల్లి శ్రీకర హాస్పిటల్స్ సహకారంతో రామాయంపేట నిజాంపేట మండలాల ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి, పిఎంపీలు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలుపుకొని ఉచిత సేవలు అందించడం అభినందనీయం అన్నారు. ఏ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి హాజరై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం తనకు చాలా సంతోషం ఉందన్నారు. అలాగే అడిషనల్ డీసీపీ రాచకొండ కమిషనరేట్ నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన చల్మెడ గ్రామంలో గ్రామస్తుల సమక్షంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొనడం తనకు తినలేని సంతోషం కలిగించిందన్నారు. ఆర్ఎంపీపీ ఎంపీ అసోసియేషన్  చల్మెడ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్ అధ్యక్షుడు బైరవరెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న తాము ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనూ కార్పోరేట్ స్థాయి వైద్యం ఉచితంగా ప్రజలకు అందాలన్న దృడ  సంకల్పంతో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో సుమారు 300 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పట ముత్యంరెడ్డి, తిరుమలనాథ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ అక్క పల్లి రాంరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, నంద్యాల బాల్ రెడ్డి, నంద్యాల ముత్యం రెడ్డి,  శ్రీకర హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఎం. రవికుమార్, శ్రీకర హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ లత, డాక్టర్ తేజస్విని, డాక్టర్ రమేష్, పి ఎం పి, ఆర్ ఎం పి అసోసియేషన్ సభ్యులు బాల్రాజ్, శేఖర్, రాజు, ప్రసాద్, కిషన్, అంజిరెడ్డి, సాయన్న, చంద్రం, సిద్ధి రాములు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *