



బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు..
రక్త దాన శిబిరం, ఏడుపాయలలో ప్రత్యేక పూజలు..
సిద్దిపేట టైమ్స్, మెదక్, ప్రతినిధి జూన్ 8
నేడు బిఆర్ఎస్ నేత, మెదక్ నియోజక వర్గ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాణిక్య రెడ్డి తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేక్ కటింగ్ అనంతరం ఏడుపాయాలలో దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు మాణిక్య రెడ్డి తెలిపారు. జిల్లా ,నియోజక వర్గ మండల నాయకులు పాల్గొననున్నారు.



