ప్రజా ప్రతినిధులే భూ కబ్జాకోర్లు..! దుద్దెడలో అసైన్డ్ భూములకు రెక్కలు విచ్చలవిడిగా భూ మాఫియా దందా బాధితులను బెదిరిస్తున్న మాఫియా.. లబోదిబోమంటున్న బాధితులు

ప్రజా ప్రతినిధులే భూ కబ్జాకోర్లు..! దుద్దెడలో అసైన్డ్ భూములకు రెక్కలు విచ్చలవిడిగా భూ మాఫియా దందా బాధితులను బెదిరిస్తున్న మాఫియా.. లబోదిబోమంటున్న బాధితులు
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

ప్రజా ప్రతినిధులే భూ కబ్జాకోర్లు..!
దుద్దెడలో అసైన్డ్ భూములకు రెక్కలు
విచ్చలవిడిగా భూ మాఫియా దందా
బాధితులను బెదిరిస్తున్న మాఫియా.. లబోదిబోమంటున్న బాధితులు

సిద్దిపేట టైమ్స్, మడూరి శ్రీరామ్, జూన్ 25

ప్రజా సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులే భూ కుంభకోణాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే సిండికేట్‌గా ఏర్పడి వాటిని ఆక్రమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు భూ కబ్జాదారులుగా మారితే, వారికి కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తూ లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మాఫియా ఆగడాలతో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
దుద్దెడ పరిధిలోని కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు ప్రజా ప్రతినిధులు భూమాఫియాగా మారి ప్రభుత్వ అసైన్డ్, మిగులు భూములను ఆక్రమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో “కలెక్టరేట్ నీడలో భూభాగోతం” పేరుతో వెలువడిన కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించి, భూ అక్రమాలకు పాల్పడిన కొందరు ప్రజా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.
కొండపాక, దుద్దెడ గ్రామాలకు చెందిన పలువురు మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు కలిసి మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుద్దెడ పరిధిలోని కొన్ని పట్టా భూముల్లో ఉన్న మిగులు భూములను సైతం సర్వే నంబర్లు మార్చి, అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా అధికారుల అండదండలతోనే సాగుతోందని, ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లే అందుకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.
తాజాగా దుద్దెడ పరిధిలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న సబ్‌స్టేషన్ సమీపంలోని సర్వే నంబర్ 609లో, చౌడాలమ్మ దేవాలయం వద్ద ఉన్న “మాలోళ్ల దిబ్బ” ప్రాంతంలో దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు నోటరీ పత్రాల ద్వారా స్వాధీనం చేసుకుని, ఇతర సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తుత ప్రజా ప్రతినిధుల్లో కొందరు బహిరంగంగానే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ అధికారుల సహకారంతో మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూములపై కన్నేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని, కోట్లలో అక్రమ లాభాలు పొందారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, భూ మాఫియాపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిన తర్వాత తమ పని ముగిసిందన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ మాఫియాను నమ్మి భూములు కొనుగోలు చేసిన బాధితులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను బయటపెడితే “మీ భూమి మీకే దక్కకుండా చేస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పలువురు బాధితులు అన్యాయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది.
దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఇందులో భాగస్వామ్యమైన ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులను విధుల నుంచి తొలగించి, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *