కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..

కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..

కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్..
గూడెం బాటలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్,ముగ్గురు ఎంపీపీలు ముగ్గురు జడ్పీటీసీలు, ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్..

హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి సాయంత్రం 5:30 కి  చెరబోతున్నట్లు సమాచారం..

సిద్దిపేట టైమ్స్ : పటాన్చెరు ప్రతినిధి :

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. గతంలో మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించటంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. మైనింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలుమార్లు విచారించిన తర్వాత.. ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచారు. లాకర్లలో భారీ మొత్తంలో బంగారం బిస్కెట్లు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పేపర్లను ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు సుమారు రూ.300 కోట్లు సంపాధించినట్టుగా ఈడీ అభియోగాలు మోపటంతో పాటు కేసు కూడా నమోదు చేసింది.
మధ్యకాలంలో బిజెపిలోకి చేరనున్నారని కాని ప్రయత్నాలు ఫలించలేదని అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక నేతల అభ్యంతరంతో ఆగిపోయారు. నిజానికి పది రోజుల క్రితమే కాంగ్రెస్ లోకి చేరాలి కానీ పటాన్చెరులో ఇద్దరు బలమైన నేతలు ఉండటం వల్ల ఒకరు కాట శ్రీనివాస్ గౌడ్ మరొకరు నీలం మధు వారిదరిని సముదాయించి పార్టీలో రాడానికి ఇంత సమయం పట్టిందని అక్కడ నేతలు ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే భేటీ అవ్వగా.. స్థానిక నేతలకు దానం నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‪లో చేరేందుకు దారి క్లియర్ అయ్యింది.

హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, ఐ ఎన్ పి ఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి సాయంత్రం 5:30 కి  చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *