సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

హుస్నాబాద్ పట్టణం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి..

మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొండపర్తి నగేష్ పిలుపు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ఈ నెల 19న సిద్దిపేటలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ తీయడం లింగమూర్తి, 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొండపర్తి నగేష్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేణులు సైతం అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఇదిలా ఉండగా, హుస్నాబాద్ పట్టణంలోని 20 వార్డుల నుంచి సభకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు రూట్లను ఏర్పాటు చేసినట్లు కేడం లింగమూర్తి, కొండపర్తి నగేష్ తెలిపారు. వార్డుల వారీగా నిర్ణయించిన ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా వార్డుల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్ణీత ప్రాంతాలకు చేరుకుని సిద్దిపేట సభకు తరలిరావాలని కోరారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *