సిద్దిపేట తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం! “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ వ్యాఖ్యలు..?

సిద్దిపేట తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!  “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ వ్యాఖ్యలు..?

సిద్దిపేట తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

“మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ వ్యాఖ్యలు?

-సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

-కలెక్టర్ కు వాట్సాప్ ద్వారా బాధితుడి ఫిర్యాదు

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట రూరల్, అక్టోబర్ 28:

ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయమై అడిగిన వ్యక్తితో సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ మాట్లాడిన తీరు వివాదానికి దారితీసింది. “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బండచర్లపల్లికి చెందిన బాధితుడు రంజిత్ కుమార్ కలెక్టర్ కు వాట్సాప్ ద్వారా వీడియో పంపి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

అనుమతులు అడిగితే అసహనం!

బుధవారం గ్రామానికి వచ్చిన తహసీల్దార్‌ను గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అనుమతుల గురించి అడగగా, దురుసుగా మాట్లాడారని రంజిత్ కుమార్ ఆరోపించాడు. ఇంటి నిర్మాణానికి సుడా అధికారులు అనుమతులు ఇస్తున్నారని చెప్పినప్పటికీ, తనపై బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై హెచ్చరించా: తహసీల్దార్

ఈ విషయమై తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ ను వివరణ కోరగా గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. కొందరు ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించేందుకు అనుమతులు కోరారని, ప్రభుత్వ భూమిని కబ్జా చేయనివ్వబోననిహెచ్చరించినట్లు వివరించారు.బాధితుడి ఆరోపణలు, తహసీల్దార్ వివరణ నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *