సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల కబ్జాపై విచారణ జరిపించాలి… సీఎం రేవంత్ రెడ్డికి శ్రీనివాస సేవా సమితి, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుల డిమాండ్..

సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల కబ్జాపై విచారణ జరిపించాలి…  సీఎం రేవంత్ రెడ్డికి శ్రీనివాస సేవా సమితి, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుల డిమాండ్..

సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల కబ్జాపై విచారణ జరిపించాలి…

సీఎం రేవంత్ రెడ్డికి శ్రీనివాస సేవా సమితి, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుల డిమాండ్

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 30,

సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన ఉద్యానవన స్థలం అన్యాక్రాంతమైందని శ్రీనివాస సేవా సమితి అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకుడు ఉడుత మల్లేశం యాదవ్ ఆరోపించారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

సిద్దిపేట టౌన్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో బ్లాక్ ఆఫీస్ సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుతో ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే మదన్‌మోహన్ సూచనల మేరకు, అప్పటి ఆర్డీవో వెంకట నరసయ్య ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయానికి కేటాయించినట్లు పేర్కొన్నారు.

అయితే, సిద్దిపేట ప్రజలు, భక్తులు, దాతల సహకారంతోనే వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని వారు గుర్తుచేశారు. ఆలయం పేరుతో కేటాయించిన ఐదు ఎకరాల భూమి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆలయం పేరు మీద కొనసాగిందని, అనంతరం ఆ భూమిని వ్యక్తిగతంగా తమ కుమారుల పేర్లకు మార్చుకున్నారని ఆరోపించారు. చివరకు ఆలయానికి కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది?

ఆలయానికి కేటాయించిన భూమికి సంబంధించిన పత్రాలు ఎలా వచ్చాయి? అసైన్డ్ భూమిని ఏ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు? ఐదు ఎకరాల భూమి నుంచి నాలుగు ఎకరాలు ఏ విధంగా చేతులు మారాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. భూమి బదలాయింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

దేవాలయాలకు చెందిన భూములు, ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం సరికాదని అన్నారు. ఆలయ ఆస్తులను కాపాడలేని వారికి రాజకీయాల్లో పోటీ చేసే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దేవాలయ భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం సిద్దిపేటకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, భక్తులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు సత్యం, వేణుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *