హుస్నాబాద్:

మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వార్డు కౌన్సిలర్ గాదపాక రవీందర్ ఆధ్వర్యంలో నూతన మురుగుకాలువ నిర్మాణం, మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనులు పూర్తయితే వార్డులో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేపట్టడంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




