మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక.. హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.. గైరాజరైన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..

మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక.. హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.. గైరాజరైన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..

మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక..
హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు..
గైరాజరైన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..

సిద్దిపేట టైమ్స్, రామాయంపేట, మే1

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. నూతన సభ్యులుగా దేమే యాదగిరి, చింతల రాధా భవాని, మహమ్మద్ గౌస్, ఆసియా సుల్తానా ఎన్నికయ్యారు. ఈ కో ఆప్షన్ ఎన్నికకు బి.ఆర్.ఎస్ కౌన్సిలర్లు చౌదరి చరిత, మధ్యల మాధవి, కొక్కు ప్రవీణ్ కుమార్ గైరాజరయ్యారు . ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా ప్రధాన సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తామని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. పాలక, ప్రతిపక్షాలనే భేదం లేకుండా కౌన్సిలర్లందరూ వార్డుల అభివృద్ధికి సహకరించాలని, నిధుల కేటాయింపులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రామాయంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్ పర్సన్ పోచమ్మ నవనీత గణేష్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మేనేజర్ ఏ.రఘువరన్, కౌన్సిలర్లు, గగులోత్ రవి, బైరం స్వప్న కుమార్, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, దాకి శ్యామల స్వామి, మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *