
హ


ార్టికల్చర్ కోర్సు ఏర్పాటుపై విద్యార్థుల ఆందోళన.. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసి
సిద్దిపేట టైమ్స్ ములుగు ఆగస్టు 25:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సును ఏర్పాటు చేయొద్దంటూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి చెందిన పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసివేసి గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఎల్లుండి జరగనున్న కౌన్సెలింగ్‌ను వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హార్టికల్చర్ కోర్సులు హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలోనే కొనసాగించాలని, ఆ విశ్వవిద్యాలయ హోదాను కాపాడాలని నినాదాలు చేశారు.
గత 20 ఏళ్లుగా హార్టికల్చర్ విభాగంలోని హెచ్‌ఓ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై వ్యవసాయ మంత్రిని కలిసి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఎస్‌ఐ రఘుపతి, ఎమ్మార్వో రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని నచ్చజెప్పినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ గేటు ఎదుటే బైఠాయించారు.
హార్టికల్చర్ కోర్సుకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను వెంటనే నిలిపివేసి, హార్టికల్చర్ విద్యకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ హోదాను కాపాడాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు




