కొత్త పాత తేడాలే..  పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు .. -మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..

కొత్త పాత తేడాలే..  పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు .. -మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..

ొత్త పాత తేడాలే.. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ..
-మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీష్ రావుకు లేదు..
-జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్..

పార్టీ కోసం పనిచేసే వారికే పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపునిస్తుందని, పార్టీ కోసం పని చేసే వారే పార్టీకి అవసరమని కొత్త పాత అనేది తేడా ఏది ఉండదని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శుక్రవారం నాడు రామయంపేట మున్సిపల్ పరిధి లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటూ గుర్తింపునిస్తుందని పార్టీలో చేరిన వారిలో కొత్త పాత తేడా అనేది ఏది ఉండదని అందర్నీ కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధి కోసం పనులు చేయబడటం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఉచిత విద్యుత్తు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి హరీష్ రావు కు లేదని 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర మొత్తం అభివృద్ధిలో కొట్టు పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇల్లు, పేదలకు సన్నబియ్యం, వంటి పథకాలు తీసుకువచ్చి పేదలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మాజీ జెడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామయంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి, ఫ్లోవెల్ కృష్ణారెడ్డి, చప్పేట ముత్యంరెడ్డి, మనోహరాబాద్ మైపాల్ రెడ్డి, ఉప్పల రాజేష్, ప్రకాష్, బైరం కుమార్, చింతల యాదగిరి, డాకి స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *