పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. సిద్దిపేట ఆర్డీవో సదానందం..

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. సిద్దిపేట ఆర్డీవో సదానందం..

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. సిద్దిపేట ఆర్డీవో సదానందం..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, జూన్ 5

పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా భావించి ప్రకృతి సంరక్షణకు కృషి చేయాలని సిద్దిపేట ఆర్డీవో సదానందం అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలుగుప్రభ ప్రచురించిన ప్రకృతి విలపిస్తోంది ..పుస్తక ఆవిష్కరణ
కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యావరణ సంరక్షణకు సంబంధించి తెలుగుప్రభ దినపత్రిక చేస్తున్న కృషి అమోఘమని ఆయన ప్రశంసించారు.
“జనం కోసం జర్నలిజం” అనే ట్యాగ్‌లైన్‌కు అనుగుణంగా తెలుగుప్రభ ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ సమాజానికి సేవ చేస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ జిల్లా ప్రతినిధి అయ్యమ్మగారి సత్యనారాయణ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు మడూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *