పంట వ్యర్ధాలకు నిప్పు.. రైతు బలి..!
ఏనగుర్తి గ్రామంలో విషాదం..
సిద్దిపేట టైమ్స్, అక్బరుపేట, భూంపల్లి మే 30
పంట వ్యర్థాలను కాల్చితే నష్టం… కలియదున్నితే మేలని అధికారులు మొత్తుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోని రైతులు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పొలంలో వరికొయ్యలను తగులబెడుతూ ప్రమాదవశాత్తూ రైతు గడ్డిలో పడి.. పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది.నిప్పుతో చెలగాటం ప్రాణ సంకటం అని.. మీడియా, పోలీసులు, ప్రభుత్వం ఎంత చెపుతున్నా కొందరు రైతులు ఆలకించడం లేదు.. వాళ్ళ అమాయకత్వమో మూర్ఖత్వమో.. ఏమో కానీ.. చివరకు ఊహించని విషాదంగా మారుతుంది.. పంట వ్యర్ధాలకు పెట్టిన నిప్పు ప్రాణాలు మింగేస్తుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం ఏనుగుర్తి గ్రామంలో మహా విషాదం జరిగింది. వరికొయ్యలకు పెట్టిన మంటల్లో పడి రైతు కోప్పల ఎల్లయ్య (65)సజీవదహనం అయ్యాడు.వరికొయ్యల మంటలు బలితీసుకున్న ఈ ఘటన గ్రామంలో విషాదంగా మిగిలింది.




