చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!

చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!

చేర్యాల ప్రాంతంలో  పేద ప్రజలకు వైద్యం చేయనివ్వరా!

పార్టీ ఫండ్ పేరుతో సిపిఎం నాయకులు బెదిరింపులు

అక్షర హాస్పిటల్ ఎండి డాక్టర్ సంతోష్ కుమార్

సిద్దిపేట టైమ్స్,చేర్యాల:

చేర్యాల ప్రాంతంలో గత ఆరు సంవత్సరాలుగా అక్షర హాస్పిటల్ నెలకొల్పి పేద ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం వైద్య వృత్తికి అంకితమైన తనపై స్థానిక సిపిఎం నాయకులు ఆముదాల మల్లారెడ్డి పార్టీ ఫండ్ పేరుతో డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయంపై గత కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా సిపిఎం నాయకులు తనపై బెదిరింపు కేసులు పెట్టారని ఈ విషయంపై స్థానిక సిపి  దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి అందులో తనపై ఎలాంటి నేరం రుజువు కాకపోవడంతో సిపిఎం నాయకులు ఎలాగైనా తనపై కక్ష సాధింపు చర్యలు సాధించాలనే క్రమంలో కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో వైద్యశాఖ నుండి ఏలాంటి అనుమతులు లేకుండా వర్ణిక క్లినిక్ పేరిట క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ పాడిబెట్టి నర్సింహులుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితులు కోరడంతో కారణాలు తెలుసుకోవడం కోసం గ్రామస్తులను కలువగా వారు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్ గా క్లినిక్ నడుపుతూ పట్టపగలే మద్యం సేవించి రోగులను చూస్తున్నాడని, సులభంగా నయమయ్యే వ్యాధులను కూడా తీవ్రత ఎక్కువగా ఉందని రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు,గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయంపై సంబంధిత జిల్లా మెడికల్ అసోసియేషన్ కి తెలుపగా వారు పలు విషయాలపై ఎంక్వేరీ చేసి సంబంధిత ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నా ఆర్ఎంపి డాక్టర్ స్థానిక సిపిఎం నాయకులను కలవడంతో వారు గురువారం స్థానిక సోషల్ మీడియాలో అక్షర హాస్పిటల్ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్లను తన హాస్పిటల్ కు గ్రామాలలో ప్రజలను తన ఆసుపత్రికి పంపడం లేదని,దానిపై కోపంతోనే డాక్టర్లపై జిల్లా మెడికల్ అధికారులతో కేసులు పెట్టిస్తున్నాడనే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇప్పటికైనా నేను ఏ ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ని మా ఆసుపత్రికి పేషెంట్లను పంపమని గాని, పేషెంట్లను పంపిస్తే పర్సంటేజ్ ఇస్తా అని ఎక్కడైనా ఎవరు ముందైనా అన్నట్టు నిరూపిస్తే అక్షర హాస్పిటల్ భవనాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి,ధూళిమిట్ట నాలుగు మండలాల ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతానని సవాల్ చేశారు. ఈ నాలుగు మండలాల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నిమిత్త ఫీజులతో వైద్యం చేస్తూ వారి మనసులలో స్థానాన్ని ఏర్పరచుకున్నానని అలాంటి తనపై ఈ విధంగా ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలని డాక్టర్ సంతోష్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్ లు పాల్గొని అక్షర హాస్పిటల్ యాజమాన్యం,డాక్టర్ సంతోష్ కుమార్ తమకు ఎలాంటి ఇబ్బందులను గాను, పేషెంట్లను వారి ఆసుపత్రికి పంపమని ఇప్పటివరకు చెప్పలేదని వారు తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *