చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..
సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..<br>సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ..సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన ABVP

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి శవయాత్రను స్థానిక గుర్రం బొమ్మ చౌరస్తా నుండి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఏబీవీపీ. ఈ సందర్భంగా ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పెండింగ్ లో ఉన్న 8200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేస్తామని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా కనీసం రాష్ట్రంలో విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి నియమించకుండా విద్యాశాఖను స్వయంగా నేనే చూస్తున్నాను అని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు పేద, మధ్యతరగతి విద్యార్థులు కనబడడం లేదా, గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కళాశాలలో ఫీజులు కట్టలేక అనేకమంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నటువంటి దుస్థితి, చదువు పూర్తి అయినటువంటి విద్యార్థులు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక కనీసం చదివిన సర్టిఫికెట్లు తీసుకోకుండా విద్యార్థులు అరాకోరా పనులు చేసుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది మరోపక్క 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ మరియు కేజీవీబీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఇప్పటికే 106 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దౌర్భాగ్యమైన పరిస్థితులు, విద్యార్థుల ప్రాణాలు పోతున్న లెక్కచేయని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని లేదా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షేమ హాస్టల్ లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి విద్యావ్యవస్థను పూర్తిగా పటిష్టంగా రూపుదిద్దాలని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, నగర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్, కళాశాల కార్యదర్శులు గురు, సుజిత్, కౌశిక్, అభిచరణ్, రాకేష్, సంధ్య, లలిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *