వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..!తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు..దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట..అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..!

వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..!తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు..దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట..అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..!

వందల కోట్ల దేవుడి భూమి కాజేశారు..!

  • తెలియకుండా దేవుడి పై భూమి ఎక్కిందని భుకాయింపు..
  • దేవుడి పేరిట ఎలా ఎక్కిందో అర్థమవుతలేదట..
  • అమ్ముకున్నారనటం నిరాధారమైన ఆరోపణట..!

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; ఆగస్టు 16

సిద్దిపేట మోహినిపుర శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తులు కాజేసిన ప్రబుద్ధులే.. తమ స్వంత భూమి.. తమ పేరిట ఉన్న భూమి తమకు తెలియకుండా దేవుడి పేరిట ఎలా ఎక్కిందో తమకే తెలియడం లేదని రచ్చకెక్కుతున్నారు. రాత్రికి రాత్రి ఆ వేంకటేశ్వర స్వామే.. రికార్డులు మార్చేసాడేమో.. నన్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఆ వంశపారంపర్య చైర్మన్ కుటుంబం.. ఈ భూమి తమ పేరిట ఉంటే తమకు తెలియకుండానే రికార్డులు మారాయని.. అవి ఎలా మారాయో వారికి తెలియడం లేదని కొత్తగా భుకాయిస్తున్నారు. దేవుడి పేరిట ఉన్న భూమిని కాజేసిందే కాక.. తమ స్వంత భూమి దేవుడి పేరిట ఏలా రికార్డులలో ఏక్కిందో అర్థమవుతలేదని.. కొత్త నాటకానికి తెర లేపుతున్నారు. సర్వే నంబర్ 1340/3 లో 5 ఎకరాల తమ స్వంత భూమిలో నుంచి దేవుడికి కేవలం ఒక ఎకరం మాత్రమే తిరునగరి వేంకట నర్సయ్య దైవ నిత్య పూజకు పూల అవసరం కోసం భక్తితో 1981లో వ్రాసిఇచ్చారట. భక్తిలో కేవలం ఒక ఎకరం భూమి దేవుడి పై వ్రాసి ఇస్తే తమ కుటుంబం దేవుడి భూమి అమ్ముకున్నారని నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని దేవాలయ వంశపారంపర్య కమిటీ చైర్మన్ కుటుంబం భుకాయిస్తున్నారు.

శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయ భూమి 5 ఎకరాలు సిద్దిపేట పట్టణం హైదరాబాద్ రహదారిలో ఉంది. ఈ భూమి ప్రస్తుతం వందల కొట్ల రూపాయల విలువైన భూమి. దీంతో ఆ స్థలం పై కన్నేసిన కొందరు పెద్దలు ఆ భూమిని ఎలా కాజేయాలో పక్క ప్లాన్ రచించారు. పక్క ప్లాన్ ప్రకారమే ఆ భూమిని కాజేశారని స్థానికులు విమర్శిస్తున్నారు.

అసలు కథ.. ఇది
సిద్దిపేట లో 1959లో ప్రభుత్వ భూమిని తిరునగరి రంగమ్మకు సర్వ. నెం.1340 లో 5 ఎకరాల భూమి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అప్పుడు ఆ భూమి వ్యవసాయ భూమి అవ్వడంతో భూములకు పెద్దగా ధరలు లేక పోవడంతో ఎవరు పట్టించుకోలేదు. రంగమ్మ మరణం తర్వాత వారసుడుగా తిరునగరి వేంకట నర్సయ్య 1969సం.లో భూమిని తన పేర పట్టా మార్పిడి చేసుకున్నాడు. నర్సయ్య రెవెన్యూ శాఖలో పనిచేస్తుండడంతో ఆప్పుడే చక్రం తిప్పి రికార్డులో పట్టాదారుగా తన పేరు నమోదు చేసుకున్నట్లు విమర్శలు వినపడుతున్నాయి. అయితే 1975 లో సిద్దిపేట మోహినిపుర వీదిలో
శ్రీ వీర హనుమాన్ దేవాలయ స్థల పరిదిలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరిగింది. పురః ప్రముఖుల సహకారముతో దేవాలయ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో తిరునగరి వేంకట నర్సయ్య రెవెన్యూ శాఖలో పని చేస్తుండటంతో తనకున్న పలుకుబడితో దేవాదాయ శాఖ ఆదికారులతో కుమ్మక్కై దేవాలయమునకు వంశపరంపర్య వ్యవస్థాపక ట్రస్ట్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంలో దేవాలయం పేరిట తన వంతుగా సర్వ్. నెం.1340/3 లో 5 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు 1997
ప్రకటించి రిజిసిస్టేషన్ చేశారు. రికార్డులలో సైతం వేంకటేశ్వర స్వామి భూమిగా ఎక్కింది. 1998 వరకు సంవత్సర కాలం రికార్డులో వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తిగా ఉన్న భూమి రికార్డుల నుంచి కనుమరుగయింది. వేంకట నర్సయ్య తనకున్న పలుకుబడి ఉపయోగించుకుని రికార్డులను తారుమారు చేశారని స్థానిక ప్రముఖులు, అప్పటి దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆ కాలంలో ఆ భూమి కి పెద్దగా ధర లేక పోవడంతో ఆలా వ్రాసిన నర్సయ్య తీరా ఆ భూమి పై కన్నేసి తిరిగి తన పేరున పట్టా చేసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆ సమయంలో ఆ భూమిలో మామిడి తోట సాగు చేశారని.. ఆ తోట సాగుకు అయ్యే ఖర్చులు కూడా దేవాలయ రికార్డులలో వ్రాసి ఉన్నాయని చెబుతున్నారు. అయితే సంవత్సర కాలం రికార్డులలో 5 ఎకరాలు వేంకటేశ్వర స్వామి దేవాలయం పేరిట ఉండటం, నిర్వహణ దేవాలయం నుంచి జరగటం, ఖర్చులు రికార్డులలో వ్రాయటంతో ఆ 5 ఎకరాల భూమి పక్క దేవాలయ ఆస్తి అని స్పష్టం అవుతుంది. అప్పటి నుంచి తిరునగరి వేంకట నర్సయ్య కుటుంబం వేంకటేశ్వర దేవాలయానికి వంశపారంపర్య కమిటి చైర్మన్ గా కొనసాగుతూ వస్తుంది. అప్పటి నుంచి దేవాలయంలో ఆ కుటుంబం అధికారం చేలాయిస్తుంది. దేవాలయానికి వ్రాసి ఇచ్చిన 5 ఎకరాలలో 4 ఎకరాల భూమిని కాజేసి అందులో 3 ఎకరాల భూమిని విక్రయించారు. ప్రస్తుతం ఒక ఎకరం దేవాలయం పేరిట.. మరో ఎకరం తమ కుటుంబం పేరిట భూమి ఉంది. కాజేసిన భూమిని స్థానిక రాజకీయ పెద్దలు, మాజీ రెవెన్యూ జిల్లా అధికారులకు డబ్బుల సంచులు అప్పగించి ఆ భూమిని క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, గత ప్రభుత్వ పాలకులు సైతం ఈ భూమిలో వాటాలు కోరినట్లు సమాచారం. ఇందులో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పలువురు విమర్శిస్తున్నారు. కాజేసిన భూమికి 2025 ఇదే సంవత్సరంలో పట్టా పాసుపుస్తకాలు సైతం పొందారు.
అయితే ఇంత తతంగం అంతా.. భక్తులకు, స్థానికులకు తెలుసు.. “మా అంగీకారం లేకుండ ఆ భూమి దేవాదాయ శాఖకి, వేంకటేశ్వర దేవాలయం పేరిట ఎవరు ఎలా కేటాయించినారో మాకు అర్ధము అవుతలేదని, ఈ భూమిని మా తండ్రి అమ్ముకొన్నారు అని నిరాధారమై ఆరోపణ మా తండ్రి పై ఏ ఉద్దేశముతో చేసినారో తెలియదంటు” ప్రస్తుత దేవాలయ వంశపారంపర్య చైర్మన్, వేంకట నర్సయ్య కూమారులు భూకాయిస్తుండటం గమనార్హం.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *