భూ అక్రమార్కులకు తహసీల్దార్ అండదండలు..
పరంపోగు భూములు కబ్జా చేసే వారితో కుమ్మక్కు.. దోస్తీ..
ఆ తహసీల్దారుకు మహిళలను సరఫరా చేస్తున్న కబ్జాదారులు
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు వింతపోకడలకు పోతున్నారు. తమ వ్యక్తిగత వ్యవహారాలు.. కాసులకోసం భూ ఆక్రమార్కులు, పరంపోగు భూములు కబ్జా చేసే ఆక్రమార్కులకు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భూములు అధిక ధరలు కలిగి ఉండటంతో భూ ఆక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎలాగైనా ప్రభుత్వ భూములను దక్కించుకోవాలని, కబ్జా చేయాలనే ఆలోచనలతో రెవెన్యూ అధికారులను గుప్పిట్లో పెట్టుకోని భూములను తమ కబంధ హస్తాలలో ఉంచుకోవాలని అధికారులకు ఎర వేస్తున్నారు. అందులో సిద్దిపేట రెవెన్యూ అధికారులు పావులుగా మారుతున్నారు. మహిళల ను సైతం ఎరగా వేస్తూ భూ ఆక్రమార్కులు.. తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఓ తహసీల్దారు భూ ఆక్రమార్కులతో చేతులు కలిపి పరంపోగు భూములకు పట్టాలు చేసి ఇస్తున్నారని తెలుస్తోంది. ఓ పరంపోగు భూమి తన పేరిట పట్టా చేశారని సిద్దిపేట కు చెందిన భూ ఆక్రమార్కుడు బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. ఆ భూ ఆక్రమార్కుడి పేరు చెబితే ఎవరైనా పరంపోగు భూములు కబ్జా చేసేది అతనే అని చెబుతుంటారు. ఆయనకు అంత గొప్ప పేరుంది. పరంపోగులు కబ్జా చేసే సదరు వ్యక్తితో తహసీల్దార్ దోస్తాని చేయడం.. వారి మధ్య ఉన్న సంబంధాలు చూసి పలువురు ముక్కున వేలేసుకోవడం అవుతుంది. ఆ తహసీల్దారు గతంలో పనిచేసిన దుబ్బాక లో సైతం ఇదే తంతు జరిగిందని, ప్రభుత్వ భూముల ను సైతం అప్పనంగా అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబేట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట లో ఓ భూమి కబ్జా కోసం ఆ ఆక్రమార్కునికి సహయ సహకారాలు అందిస్తూ సదరు పోలీసులకు సహకారం అందించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తహసీల్దార్ కు మామూళ్లు ముట్ట చెప్పడంతో పాటు, మహిళలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఎమైనా ఆ తహసీల్దార్ దోస్తాని గలీజు వ్యవహారం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా… ఆ తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.





