సిద్దిపేట టైమ్స్ ఎఫెక్ట్..
గ్రామాలన్ని శుభ్రం..
పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టండి..
అపరిశుభ్రం కనిపించవద్దు..
ప్రజలు పరిశుభ్రత పాటించాలి..
కార్యదర్శులకు ఎంపీడీఓ ప్రత్యేక ఆదేశాలు..
సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్

ప్రత్యేక అధికారుల పాలనలో మృంగ్యంగా మారిన గ్రామ పాలన గాడిన పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఎంపీడీఓ యాదగిరి అన్నారు.గత కొన్ని నెలలుగా గ్రామాల్లో పారిశుభ్రం పారిశుభ్రం ఎక్కడి అక్కడా చెత్త, చెదారం ఎక్కడి అక్కడా పేరుకుపోయి గ్రామాలన్ని కంపు కొడుతున్న నేపధ్యంలో ప్రజలు రోగాలు పడి ఇబ్బందులు ఎదురవ్వడంతో క్రమంలో మంగళవారం రోజున సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక ఆదేశాలను జారీచేశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని అన్ని గ్రామాలల్లో ఎక్కడా అపరిశుభ్రం కనిపించకూడదని మోరీలల్లో బ్లీ చింగ్ పౌడర్, పిచ్చి మొక్కలు తొలగించాలని దోమలకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలను జారీ చేస్తూ పలు గ్రామాలను సందర్శించారు. వారితో పాటు పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

