ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు.. సీఐ కొండ్ర శ్రీనివాస్
హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ ఆక్రమణలు, దుకాణాల ముందు వాహనాల అడ్డదిడ్డంగా నిలిపివేతలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు.













