కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత  పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున  కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం  బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని  అధికార యంత్రం తెలిపారు.

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణలంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీన…

బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం

బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం
బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా వీర బైరాన్‌పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. …

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ
మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులుసిద్దిపేట టైమ్స్,మద్దూరు:మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వర్కింగ్ జర్నలిస్ట్ మారెళ్ళ లక్ష్మారెడ్డి తల్లి మారెళ్ల బాలమ్మ ఇటీవల మరణించారు. ఈ సందర్బంగా తోటి జర్నలిస్టు మిత్రులు పాకాల జాకబ్, కొండూరి సతీష్ కుమార్, జెగ్గం అనిల్…

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి
ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో…

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్: హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతితో…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…
యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి...వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో  రైతులకు ఇబ్బందులుబి  ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:.హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం జరిగింది.…

హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాంమున్సిపాలిటీ లో జంక్షన్ ల సుందరీకరణ , సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాలతో అభివృద్ధి చేస్తున్నాం..గ్రామాల్లో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తున్నాం. నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో..

రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో..
రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట రూరల్, రైతులకు యూరియ కష్టాలు తప్పడం లేదు.. పోద్దంతా.. పంటపొలం ఉండాల్సిన రైతులు యూరియ కోసం పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెల్లి…