హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం
బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్ష ఉత్సాహంగా సాగింది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి, ఆ నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.













