హుస్నాబాద్ లో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖా మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
హుస్నాబాద్ మండల మరియు పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 64వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖా మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ యువజన కాంగ్రెస్ నాయకులతో మరియు సీనియర్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులకు 64 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిందని, కేవలం కాంగ్రెస్ పార్టినే యువతకు ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత వుంటుందని అన్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్నవేని విద్యాసాగర్ యాదవ్, హుస్నాబాద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోచవేని శ్రీశైలం యాదవ్, హుస్నాబాద్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ మదరవేని శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు కొండపర్తి నగేష్, మండల జనరల్ సెక్రెటరీ మరుపాక గణేష్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు కూన విశ్వతేజ ,యువజన కాంగ్రెస్ నాయకులు త్రిమూర్తి, సమీర్, పవన్, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.