హుస్నాబాద్ మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు చెన్నవేణి విద్యా సాగర్, మండల అద్యక్షుడు పోచవేణి శ్రీశైలం యాదవ్,NSUI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీనవెని రాకేష్ యాదవ్, హుస్నాబాద్ నియోజకవర్గ NSUI అద్యక్షుడు సనత్ రెడ్డి హాజరు అయ్యారు.
ఈ నెల 24జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించి తదనంతరం వారు మాట్లాడుతూ… ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున చిగురు మామిడి మండలం లోని అన్ని గ్రామాల యువతి యువకులు, ముఖ్యంగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఈ జాబ్ మేళా కార్యక్రమంలో 60+ రకాల కంపెనీలు పాల్గొంటాయని 5000+ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఇంటర్యూలు ఉంటాయని ఎవరి స్థాయిని బట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థి దశ నుండి నాయకునిగా ఎదిగిన మంత్రి గారు విద్యార్థుల, యువకుల సమస్యలు తెల్సిన నాయకుడు కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువత నిరుద్యోగులుగా ఉండద్ధని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే వారు ఉదయం 10 గంటల లోపు తిరుమల గార్డెన్ కు చేరుకోవాలని,సంబందించిన సర్టిఫికెట్లను వెంట తెచ్చుకోవాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంతాల శివారెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ, బందెల హరీష్, అసెంబ్లీ సెక్రటరీలు మ్యాదరవేణి, శ్రీకాంత్, పోగుల కుమార్, ముడికే ప్రశాంత్, పట్టణ ఉపాధ్యక్షులు నగేష్, మండల ఉపాధ్యక్షుడు కమలహాసన్, మండల ప్రధాన కార్యదర్శి గణేష్, గట్టు సాయి, పున్న రంజిత్, రాకేష్, బైరి జగన్, తిరుమలేష్, పవన్, దొబలా అనిల్, రాజు పొన్నబోయిన, రమేష్, రణధీర్, శివ, వెంకటేష్, ప్రకాష్, శ్రీకాంత్, అనిల్, సాగర్ తదితరులు ఉన్నారు.