కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత
– సిండికేట్ తో చెలరేగుతున్న వైన్స్ యజమానులు
– నిమ్మకు నీరెత్తని ఎక్సైజ్ అధికారులు
సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక ప్రతినిదీ
కాలం చెల్లిన బీరు తాగి అస్వస్థకు గురైన సంఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. దుబ్బాక పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రేణుక వైన్స్ లో బీరు కొనుగోలు చేసి తాగాగా, ఆ వ్యక్తికి కడుపులో మంట రాగానే వెంటనే తాను సేవించిన బీర్ పరిశీలించి చూడగా దానిపై డేటు ఎక్స్పైర్ అయి ఉంది. వెంటనే ఆ వ్యక్తి కడుపు నొస్తుందని వైన్స్ వద్దకు వెళ్లగా.. సిండికేట్ యజమానులు అతన్ని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించి చేతులు దులుపుకున్నారు. కానీ మద్యం తాగిన వ్యక్తికి తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడం జరిగింది. ఇంకా అతని ఆరోగ్యం కొలుకోలేదు. కానీ వైన్స్ యజమాని మాత్రం మేము అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నామని హుందాగా ఉన్నారు. రేణుక ఎల్లమ్మ వైన్స్ యజమాని దుబ్బాక వైన్స్ సిండికేటును నడిపిస్తూ.. ఎక్సైజ్ శాఖ అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కాలం చెల్లిన బీరు అమ్మడం పై ఎక్స్ సైజ్ శాఖ పై పలు విమర్శలు వస్తున్నాయి.
కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత





