అనుమానాస్పదంగా యువకుడు మృతి
– అఖిల్ మృతి పై పలు అనుమానాలు
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దుబ్బాక మండలం పోతారం చెందిన డీలర్ నరసింహులు కుమారుడు అఖిల్ వయస్సు 27 సంవత్సరాలు వృత్తి మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. ఆదివారం రోజున తన బంధువులు పెద్ద గుండె వెళ్లి ఎల్లమ్మ వద్ద పండుగ చేసుకుండగా అక్కడికి వెళ్లి భోజనం చేసి దుబ్బాకకు తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్నాడు. అనంతరం దుబ్బాక ఎల్లమ్మ ప్రక్కనున్న మఱ్ఱి చెట్టు వెనకాల మృతి చెంది ఉన్నాడు. మృతుడు అఖిల్ కు సంబంధించిన ఫోన్ ఎవరో తీసుకెళ్లి అతని వద్ద వేరే ఫోన్ ఉంచారు. అంతేకాకుండా మృతునికి సంబంధించిన బైక్ కూడా కనిపించడం లేదు. మృతుని మరణం వెనక పలు అనుమానాలు వెలువెత్తుతున్నాయని కుటుంబీకులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా అఖిల్ ది హత్య లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడా అనే సంఘటన తెలియాల్సి ఉంది….?
