హుస్నాబాద్ ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి బోర్ వేయిస్తున్న పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాంసుందర్ లాల్
సిద్ధిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా హుస్నాబాద్ వాస్తవ్యుడు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ గాజుల శ్యాంసుందర్ లాల్ ధర్మపత్ని మాధవి దంపతులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పూదారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ధర్మకర్తలు భక్తులకు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, వేసవి కాలం కావడంతో స్నానాలకు మరియు వంటలకు నీటి సౌకర్యం లేకఇబ్బంది అవుతుందని చెప్పగానే వెంటనే స్పందించి ఈరోజే తన సొంత ఖర్చులతో బోరు వేయించమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ పుదరి లక్ష్మీనారాయణ గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు మరియు భక్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ కరన్ సింగ్, పోలోజు శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్, పున్న సమ్మయ్య, శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
