మా జీతాలు చెల్లించరా..!
రొడెక్కిన గ్రామ పంచాయతీ కార్మికులు..
వేతనాలు రాక కార్మికుల ఇబ్బందులు
ఇంటింటి కి తిరుగుతూ భిక్షాటన షురూ..
ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వేడుకోలు..
సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్

పంచాయతీలో అపరిశుభ్రతను తొలగించే వారి జీవితాల్లో మాత్రం ఇప్పటికి ఇబ్బందులే నెలకొన్నాయి. చాలీచాలని వేతనాలతో కఠిన పరిస్థితుల్లో పంచాయతీ కార్మికులు బతికేడుస్తున్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోవడం సరిగ్గా జీతాలు రాకపోవడంతో చేసేదేం లేక బిక్షాటన షురూ చేశారు. ఈ సంఘటన జగదేవ్ పూర్ మండలంలో మంగళవారం నెలకొన్నది. చాలీ.. చాలని జీతాలతో పని చేసే గ్రామ పంచాయతీ కార్మికులు వారికి సుమారుగా మూడు నెలల గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో వారంతా ఏకమై ఇక చేసేది ఏమి బిక్షాటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని మునిగడప, పలుగు గడ్డ, తదితర గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు రావడం తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాలేదు.గత మూడు నెలలు గడుస్తున్నా తరుణంలో వారంతా ఏకమై బిక్షాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది మాట్లాడుతూ వారికి నెలలు గడుస్తున్నా వేతనాలు లేక కుటుంబం నడవలేని స్థితిలో ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వేతనాలు లేకపోవడంతో విధులను నిర్వహిస్తునే వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేసి మరీ వారి కుటుంబాలను పోషించుకుంటున్నామని వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలకు సంబంధించిన నిధులను విడుదల చేసి వేతనాలు అందించి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. వారిలో లింగవ్వ, కిష్టమ్మ, పుషమ్మ, దేవి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.