మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి

మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి

మహిళలు,యువత సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి

ప్రతి మహిళ ప్రస్తుతం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలి

త్వరలో విదేశాలకు వెళ్ళే వారి కోసం టాంకాం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంప్

హుస్నాబాద్ చౌటపల్లి లో కాలుష్యరహిత వ్యవసాయాధారిత పారిశ్రామిక కారిడార్

ప్రజా పాలన లో సంవత్సర కాలంగా ప్రారంభించిన పథకాలకు సాంస్కృతిక కళా బృందం ద్వారా గ్రామాల్లో ఆవగాహన

రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అన్ని రంగాల్లో రాణించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తో కలిసి  సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్ సెంటర్ , బ్యూటిషన్ సెంటర్ , కంప్యూటర్ ల్యాబ్ ,ఐటిఐ మెకానిక్స్ సంబంధిత సెంటర్ ను ప్రారంభించారు. బ్యూటిషన్ శిక్షణ పై మహిళలకు అవగాహన కల్పించారు. స్వయంగా కుట్టు మిషన్ పై కూర్చొని శిక్షణ కేంద్రాన్ని ప్రారంబించి మహిళల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… గిరిధర్ రెడ్డి సెట్విన్ చైర్మన్ గా నియామకం అయినా తరువాత కార్యకలాపాలు విస్తృత పరిచారని పేర్కొన్నారు. సెట్విన్ శిక్షణ కేంద్రాలు హైదరాబాద్ లో 19 ,జిల్లాలో నాలుగు  సెట్విన్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయనీ తెలిపారు.కొత్తగా ఐదు శిక్షణ కేంద్రాలు రానున్నాయి ఈరోజు హుస్నాబాద్ కేంద్రంలో సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించున్నమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జహీరాబాద్ , మహబూబ్ నగర్ , జడ్చర్ల , నల్గొండ లో కూడా కొత్తగా సెట్విన్  శిక్షణ కేంద్రాలు రానున్నాయన్నారు. మహిళలు ఇంట్లోనే కూర్చొని ఆదాయం పెంచుకోవడానికి సెట్విన్ వివిధ రకాల శిక్షణ అందిస్తుందన్నారు. ఇక్కడ హుస్నాబాద్ ప్రాంత మహిళలు ఎవరి కాళ్ళ మీద వారు నిలబడేలా తయారు కావాలనీ… కుట్టు మిషన్ , బ్యూటీషన్ , కంప్యూటర్ ల్యాబ్  ms office, అకౌంటెంట్ ఉన్నాయనీ అందులో నైపుణ్యం సాధించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యూటీషన్ కోర్స్ వస్తుందని మహిళలకు ఆదాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఎలక్ట్రిక్ మెకానిక్ శిక్షణ కోర్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మహిళలు కుటుంబాన్ని నిలబెట్టుకొని భర్తకు సహకరంగా పిల్లలకు చదువులకు ఇబ్బంది లేకుండా అండగా ఉండాలనీ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రతి  మహిళ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. విదేశాలకు వెళ్లి జాబ్ చేసుకునే నర్స్, డ్రైవర్, వంట మనిషి ఇతర చాలా రకాల ఉద్యోగాల కోసం అధికారకంగా టాంకాం ద్వారా హుస్నాబాద్ లో త్వరలోనే క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విదేశాల్లో రెండు, మూడు లక్షల జీతాలు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వమే టాం కాం కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కలిస్తుందన్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇక్కడి యువత కోసం ఎన్రోల్మెంట్ జరుగుతుందనీ అందరూ సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు.

గౌరవెల్లి కాలువల కోసం రైతులు సహకరించాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కాలువల డిజైనింగ్ తను చేసింది కాదని ఇంజనీర్ ల సూచనల ద్వారానే కాలువల అలైన్మెంట్ జరుగుతుందన్నారు.త్వరలోనే నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తామన్నారు.తరువాత పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కలిస్తమని తెలిపారు.ఇప్పటికే చౌటపల్లి లో భూమి చూశాం ఆ గ్రామస్తులు  అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదనీ హామీ ఇచ్చారు.కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు కాకుండా వ్యవసాయాధారిత పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు ఆందోళన చెందవద్దని సూచించారు.నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ వచ్చేలా చూసుకోవాలన్నారు.ఎలక్ట్రిక్ వాహనాల పై టాక్స్ లేకుండా  చూశామని మొన్నటి వరకు రోజు 5 కూడా రిజిస్ట్రేషన్ కూడా అయ్యేవి కావనీ ఈవి పాలసీ వచ్చిన మొదటి రోజే 113 ఈవి వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయనీ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా పాలన మొదటి ఏడాది సందర్భంగా ప్రజా విజయోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు విసృతంగా ప్రచారం కల్పించడానికి తెలంగాణ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా మండలి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ వాహనాలు గ్రామగ్రామాన ప్రభుత్వ పథకాల పై కళాకారులు ముమ్మర ప్రచారం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

గిరిధర్ రెడ్డి సెట్విన్ చైర్మన్ మాట్లాడుతూ… యువత కు నైపుణ్యాన్ని  పెంచడానికి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జంట నగరాలలోని కాకుండా తెలంగాణ లో కూడా సెట్విన్ కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 23 శిక్షణ కేంద్రాలు ఉన్నాయనీ మరొక 5 కేంద్రాలు రాబోతున్నాయన్నారు. అధునాతన సాంకేతిక శిక్షణ అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ,సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ మానాల మోహన్,సెట్విన్ ఎండీ వేణుగోపాల్ ,అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న,వైస్ చైర్మన్ అనిత , సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి ,డీపీఓ ,ఆర్డీవో , ఎమ్మార్వో ఇతర అధికారులు , హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , సెట్విన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *