ఎమ్మెల్సీగా గెలిపించండి… నిరంతరం ప్రజాసేవకే అంకితమౌతా
నాయకుడిగా కాదు…సేవకుడిగా వస్తున్నా…
పట్టభద్రుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా..
హుస్నాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో
పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ వెల్లడి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తాను నాయకుడిగా కాదు, ప్రజలందరికీ సేవకుడిగా పనిచేయడానికి రంగంలోకి దిగానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం హుస్నాబాద్ లో నిర్వహించిన హుస్నాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రసన్న హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయడానికి తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయ రంగంలోకి ప్రవేశించానని అన్నారు. పట్టభద్రుల మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, నిరుపేదల అవస్థలు తనకు స్పష్టంగా తెలుసునని, వారి చదువుల కోసం, తన వేతనం నుంచి 50% అందిస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో యువతకు చేదోడుగా ఉంటానని అన్నారు.

ఉద్యోగం వచ్చిన నాటి నుండి ప్రతినెలా జీతంలో 30% సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నానని అన్నారు. 15 సం వత్సరాలకు పైగా ఉద్యోగ జీవితం అనుభవం ఉన్నదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు డిగ్రీ లెక్చరర్ల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల ఉద్యోగు ల సమస్యలపై అవగాహన ఉన్నదని తెలిపారు. తెలంగాణ ఉద్య మంలో భాగస్వామ్యం అయ్యానని తెలిపారు. వేలాది మంది విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ చెప్పి వారిలో ధైర్యాన్ని నింపి లక్ష్యసాధన దిశగా కృషి చేసినానని అన్నారు. పట్టుభద్రులు ఆలోచించి మద్దతు తెలపాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల సమ్మేళనం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్న హరికృష్ణ టీం సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ తూమోజు జగదీశ్వర చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి తాళ్ళపల్లి వెంకటేష్ గౌడ్, బి ఎస్ పి రాష్ట్ర నాయకులు నిమిషాని రామచంద్రం, బీసీ సంఘం సీనియర్ నాయకులు కోహేడ కొమురయ్య గౌడ్, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, సామాజిక విశ్లేషకులు వడ్డేపల్లి మల్లేశం, క్యూ న్యూస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అఖిమ్ పాషా, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు.
