హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా
అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరాలి
కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.
కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవెళ్లి రిజర్వాయర్ నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, నీటిపారుదల సౌకర్యం లేని రామవరం అక్కన్నపేట, కట్కూరు, కన్నారం తదితర ఎగువ ప్రాంతాలకు గండిపల్లి రిజర్వాయర్ ద్వారా నీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, గండిపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టాలని, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో (నేషనల్ హైవే) కేంద్రం నిధులతో ఎల్కతుర్తి వరకు జరుగుతున్న రోడ్డువిస్తరణ లో కొన్ని మార్పులు చేయించాలని, పందిళ్ళ నుండి హుస్నాబాద్ శివారు వరకు డివైడర్ తో కూడిన 4 వరుసల రోడ్డు వెయ్యాలని , అంతకపేట్ నుండి కొత్తకొండ డబుల్ రోడ్డు పనులను CRIF నిధులతో వెంటనే ప్రారంభించాలని, హుస్నాబాద్ నుండి రామవరం వరకు గౌరవెల్లి మీదుగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడున్నందున CRIF నిధులు మంజూరైన రోడ్డు నిర్మాణానికి చేపట్టుటకు సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరవేయాలని బండిసంజయ్ కుమార్ సూచించడం జరిగింది.
కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తో అక్కనపెట్ మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి, కట్కూరు గ్రామ మాజీ సర్పంచ్ జిల్లెలఅశోక్ రెడ్డి, VHP భార్గవపురం ఖండ ప్రముఖ్ చందుపట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.