సంఘ సమాజాభివృద్ధికి కృషి చేస్తా
– నూతన పాలకవర్గానికి సన్మానం
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
నీలకంఠ సంఘ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నిన్న దుబ్బాకలో జరిగిన నీలకంఠ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గాన్ని శాలువాతో సన్మానించారు. నీలకంఠ సంఘ అధ్యక్షునిగా బోడ శ్రీహరి, ఉపాధ్యక్షులుగా కాల్వ బ్రహ్మేంద్రర్, కార్యదర్శిగా కాల్వ శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా అక్కల రాజేశ్వర్, కోశాధికారిగా తుమ్మ దుబ్బరాజాం లు గెలుపొందగా సోమవారం రోజున నీలకంఠ ఫంక్షన్ హాల్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారిని సన్మానించి మాట్లాడారు. చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి కొత్త కిషన్ రెడ్డి గన్నె భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
