హుస్నాబాద్ ‘జిల్లా’ గా నన్నెందుకు చేయరు..? నాకేం తక్కువ.!

హుస్నాబాద్ ‘జిల్లా’ గా నన్నెందుకు చేయరు..? నాకేం తక్కువ.!

హుస్నాబాద్ ‘జిల్లా’ గా నన్నెందుకు చేయరు..? నాకేం తక్కువ.!

కరీంనగర్లో కలిస్తే కరుణిస్తారా, కథనరంగమై పోరు చేయండి జిల్లా ఎందుకు కాదో చూద్దాం?

గతంలోనే హుస్నాబాద్ ను జిల్లా చేయాలని పోరుబాట…

జిల్లా పరిధిలోని మండలాలు:

1 హుస్నాబాద్ 2 అక్కన్నపేట 3 కోహెడ 4 బెజ్జంకి 5 గన్నేరువరం 6 చిగురు మామిడి 7 సైదాపూర్ 8 ఎల్కతుర్తి 9 భీమదేవరపల్లి 10 వేలేరు (కొత్త మండలాలు చేయడానికి అనువుగా ఉన్న గ్రామాలు) 11 రామవరం 12 ఇందుర్తి 13 వంగర 14 సముద్రాల వీటిని మండలాలుగా చేసినట్లయితే మొత్తం 14 మండలాలతో కూడుకొని జిల్లా కావడానికి అనుగుణంగా ఉన్నాయి.

హుస్నాబాద్ జిల్లాకు నామకరణంగా పేర్లు:

శ్రీ రేణుక ఎల్లమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పీవీ నరసింహారావు, సింగరాయ అనే వాటిలో ఏదో ఒక పేరుతో జిల్లాగా నామకరణం చేయండి.

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో నే నేను అతి పెద్ద నియోజకవర్గన్ని నాటి ఇందుర్తి నుండి నేటి హుస్నాబాద్ వరకు నేను ఎందరినో నాయకులను తయారు చేసి అసెంబ్లీకి పంపాను నేను శాసనసభాపక్ష నేతగా మంత్రిగా ఈ ప్రాంత ఓట్లతో గెలిచి ఎంపీగా పార్లమెంటుకు వెళ్లిన వారు ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రిగా పదవులు వరించిన నియోజకవర్గాన్ని పోరాటాల పోరు గడ్డను అమరవీరుల స్తూపం ఆసియా ఖండంలోనే రెండో స్థానంలో ఉన్నాను. నియోజకవర్గ కేంద్రంలో రేణుక ఎల్లమ్మ ఆలయం ఉంది ఇక్కడ ప్రతి ఏడాది రేణుక ఎల్లమ్మ జాతర నెల రోజులపాటు జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ప్రజలతో రద్దీగా ఉంటాను వేములవాడ తర్వాత రెండవ రాజరాజేశ్వరి ఆలయం పొట్లపల్లిలో ఉంది ఈ ఆలయం ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ రద్దీగా ఉంటుంది ఇది జిల్లాకు పుణ్యక్షేత్రాలుగా ఉపయోగపడతాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కాలంలో మహమ్మదాపూర్ గుట్టల్లో అమరులైన అనబేరి ప్రభాకర్ రావు తో పాటు సభ్యుల యొక్క స్తూపాలు ఇప్పటికి చిహ్నాలుగా ఉన్నాయి ఉమ్మాపూర్ గుట్టల్లో ఉన్నటువంటి మహాసముద్రం గండిని కలిగి యున్నాను నన్ను జిల్లా చేస్తే ఈ ప్రాంతం పర్యటక కేంద్రంగా ఉపయోగపడతాది మరి నాకేం తక్కువ.

అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కలిగియున్నాను ఈ ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా దిగవనున్న రైతులకు నీరు అందిస్తాను రైతులు పంటలు పండించి వరి ధాన్యాన్ని నా దగ్గరలో ఉన్న పందిళ్ల మిల్లులకు ఎగుమతి దిగుమతి చేస్తారు ప్రజలకు నా నియోజకవర్గ రైతులు కూలీలు ఎప్పటికప్పుడు ఆహార ధాన్యాలను నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు మరి నాకేం తక్కువ. కోహెడ మండలం ఈ ప్రాంతం నుండి మోయ తుమ్మెద వాగు ప్రవహిస్తూ సింగరాయ ప్రాజెక్టులోకి నిరంధిస్తుంటాను ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని ఎకరాలకు నిరంధిస్తూ ఉంటాను దిగువనున్న రైతులు వరి ధాన్యం పంటలు పండించి  నన్ను విలీనం చేసిన సిద్దిపేట జిల్లాకు ఎక్కువగా వరి ధాన్యాన్ని సరఫరా చేస్తున్నారు అదే నన్ను జిల్లానుచేస్తే మిదగ్గరకే నిను వస్తాను కదా అంతేకాకుండా పుష్యమి మాఘ అమావాస్య రోజున బస్వాపూర్ గుండారెడ్డిపల్లి కూరెళ్ళ తంగళ్ళపల్లి ఈ గ్రామాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎత్తైన కొండ లోయలలో సింగరాయ జాతర జరుగుతూ ఉంటుంది ఈ జాతరకు తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా చేయటానికి అనుకూలంగా ఉంది నేను కూడా ఆదాయం రావడానికి ఉపయోగకరంగా ఉన్నాను మరి నాకేం తక్కువ. బెజ్జంకి మండలం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము ఉంది జాతర ప్రతి ఏడూ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తూ ఉంటారు ఈ జాతర నెల రోజులు సాగుతూ ఉంటుంది ఇక్కడ కూడా నేను ఆదాయాన్ని సమకూర్చి పెడతాను ఇది కూడా పుణ్యక్షేత్రంగా ఉపయోగపడడానికి వీలుగా ఉంది మరి నాకేం తక్కువ. చిగురుమామిడి మండలంలో తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం తర్వాత సుందరగిరి లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం రెండవదిగా చెప్పుకోవచ్చును ఇచ్చట కూడా ప్రతి ఏడు వెంకటేశ్వర జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు వివాహ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి నాకేం తక్కువ. సైదాపూర్ మండలం లోని సర్దార్ సర్వాయి పాపన్న నిలయముగా ఈ ప్రాంతంకేంద్ర భింబంగా ఉంటుంది అంతేకాకుండా ఎత్తయిన కొండలతో కూడుకొని యున్నాది ఈ ప్రాంతాన్ని విహారయాత్రగా చూడడానికి నేను పనికి వస్తాను మరి నాకేం తక్కువ. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ సంక్రాంతి పండగ రోజున జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కొత్త కొండ జాతర రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గటువంటి చారిత్రాత్మక ప్రదేశంగా చెప్పుకోవచ్చును నేను కూడా ఆదాయం రావడానికి పుణ్యక్షేత్రానికి ఉపయోగపడతాను మరి నాకేం తక్కువ.

సిద్దిపేట హనుమకొండ కరీంనగర్ హుజూరాబాద్ జనగాం ఈ పట్టణాలకు మధ్యన హుస్నాబాద్ కేంద్రబింబంగా ఉన్నది హుస్నాబాద్ నుండీ ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఏటు చూసినగాని 40, 50కిలో మీటర్ల దూరంలో ఉంటుంది దూరప్రాంతాలకు వెళ్లలంటే నా హుస్నాబాద్ ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు అందుకే నన్ను జిల్లా చేయమని కోరుకుంటున్నాను గతంలో కూడ హుస్నాబాద్ ను జిల్లా చేయలని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు ఇటు సిద్దిపేట అని అటు కరీంనగర్ అని కలిపి నన్ను ఆగం చేస్తున్నారు కరీంనగర్లో కలిసిపోతారో హుస్నాబాదును జిల్లాగా చేసుకుని మురిసిపోతారో అది మీ ఇష్టం ఈ ప్రాంత ప్రజలను విద్యార్థులను యువతరాన్ని నాయకులను ప్రజాప్రతినిధులను తొలిసారిగా హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యే గెలిచి మంత్రి గా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ ను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను మీ అందరిని నేను కోరేది ఒక్కటే మీరందరూ కలిసి సాయి శక్తుల కృషి చేసి నన్ను జిల్లాగా చేయగలరని కోరుకుంటున్నాను. ఇక ఉంటాను మీ అందరికీ సెలవు…


వేల్పుల (అలియాస్) చింతకింది సింగర్
సిద్దిపేట జిల్లా రిపోర్టర్, డీజేఎఫ్, జేపీఎఫ్ రాష్ట్ర కన్వీనర్
సెల్ నెంబర్ 9963174723.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *