రాష్ట్ర అవతరణ శతాబ్ది వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరు?
సిద్దిపేట టైమ్స్ ప్రతినిధి:
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ రావాల్సి ఉండగా డాక్టర్ సలహా మేరకు తెలంగాణ పర్యటన రద్దయింది
కాగా,రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది…