ఏం.. “సిద్దిపేట అబ్బాయ్” అంటు పలకరించే వారు..
రామోజీరావు మృతికి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సంతాపం..
విలువలు, విశ్వసనీయత కలిగిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటు..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్;
తనను చూడగానే “సిద్దిపేట అబ్బాయ్” అంటూ ఆప్యాయంగా పిలిచే రామోజీ రావు స్వర్గస్థులు కావడం అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, బిఅరెస్ సీనియర్ నేత ఫారూఖ్ హుస్సేన్ అంటు సంతాపం ప్రకటించారు. 1984 సంవత్సరంలో తొలిసారిగా రామోజీరావు తో తనకు పరిచయం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆనాటి నుండి అనేక సందర్భాల్లో వారు కలిసినప్పుడు తనను సిద్దిపేట అబ్బాయ్ అని పలకరించేవారని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి ప్రపంచమే గర్వించదగిన స్థాయికి ఎదగడంలో రామోజీ రావు కఠోర శ్రమనే కారణమన్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన పత్రిక, మీడియా, సినిమా, చిట్ ఫండ్స్, విద్యాసంస్థలు, ఫుడ్ బిజినెస్ రంగాలను ప్రజలకు చేరువ చేశారని వివరించారు. ఇలాంటి వ్యక్తి పరమపదించడం తెలుగు రాష్ట్రాలకు, దేశానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి, ఈనాడు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
