ప్రజాతీర్పును గౌరవిస్తున్నాము..
నాకు ఓటేసిన ఓటరు దేవుళ్ళకు కృతజ్ఞతలు..
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి..
సిద్దిపేట టైమ్స్, మెదక్:
మెదక్ లోక్ సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వెలువడిన తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీ గా విజయం సాధించిన రఘునందన్ రావు కు శుభాకాంక్షలు తెలియజేశారు.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి కృంగిపోకుండా ప్రజల్లో ఉండి వారిసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.. రాజకీయాలకు తాను కొత్త అయినా ఎంతో ప్రేమతో . తనకు పెద్ద ఎత్తున ఓటు వేసిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఓటరు దేవుళ్ళందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఎంపీ అభ్యర్థి గా అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్ గారికి, అలాగే నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు , ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, నియోజకవర్గ బాద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు సీనియర్ నాయకులు, ప్రతి కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీల ప్రభావంతో అనూహ్య ఫలితాలు రావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్తవి కావని, టిఆర్ఎస్ 23 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూడటం జరిగిందన్నారు..కేవలం 10 ఏళ్లలో తెలంగాణ ను దేశంలోనే అభివృద్ధి, సంక్షేమం లో ముందు నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.. భవిష్యత్ లో కొలుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..