ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి
సిద్దిపేట జిల్లా గ్రంధాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో మమేకం కావాలని సిద్దిపేట గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శనివారం రోజున పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి జనరల్ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అగ్రగామిలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని,పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఇసుక సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని అన్నారు. యూరియా సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న యూరియా సమస్యకు కేంద్ర ప్రభుత్వం కారణమని యూరియాను తయారు చేయించేది,రాష్ట్రాలకు సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమే అయిన కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నాయని అన్నారు. మంత్రి పొన్నం ప్రత్యేక చొరవ తో రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని యూరియా నిలువలు రానున్నాయని రైతులు ఆందోళన పడవద్దని ప్రతిపక్షాల ఊబిలో చిక్కుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ,వల్లపు రాజు, బుఖ్య సరోజన,ఎండి హాసన్, వడ్డేపల్లి వెంకటరమణ,బురుగు కృష్ణస్వామి,గట్టు రాములు, నర్సా గౌడ్, బిక్యానాయక్, గాజుల భగవాన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి





