ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం

ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం

ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశాం

ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుంచుతా

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు హుస్నాబాద్ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైసింగ్ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సాంస్కృతిక కార్యక్రమం హుస్నాబాద్ లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద 80 మంది కళాకారులతో అట్టహాసంగా జరిగింది.. కళాకారులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నాటికల రూపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో అమలు చేస్తున్న పథకాలు సంక్షేమము, అభివృద్ధి చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సభకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు హుస్నాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వంతడ్పుల నాగరాజు బృందం హుస్నాబాద్ లో చేసిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు గత 11 నెలలుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాల భర్తీ, గద్దర్ కు జ్ఞాపకంగా గద్దర్ అవార్డ్స్, రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు జరుగుతుంది. సన్నధాన్యానికి 500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, యువ వికాసం తదితర పథకాలను పాటల రూపంలో వివరించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది క్రితం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందనీ హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గా మంత్రి గా అయ్యాననీ మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందనీ తెలిపారు. మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగిందనీ వచ్చే 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందించుతానని తెలిపారు. తనని గెలిపించిన ఏడాదిలోనే ఇంత అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ ప్రజలు ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. మీ ఎమ్మెల్యే గా మంత్రిగా ప్రజల పక్షాన అండగా ఉంటున్నానని హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతానని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని ఇంటికి వచ్చి గతంలో ఇచ్చిన గ్యారంటీ కార్డ్స్ హామీలు అన్ని అమలు చేస్తమని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు పడుతున్నాయని తెలిపారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తైందనీ 2 లక్షల పైన ఉన్న వారి రుణమాఫీ కూడా అవుతుందన్నారు. 10 ఏళ్లలో గురుకుల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తమ ప్రభుత్వంలో 40 శాతం డైట్ & కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెళ్లి ప్రాజెక్టు కడతమన్నారనీ కానీ పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు కాలువల నిర్మాణం కోసం 430 కోట్లు కేటాయించి భూసేకరణ జరుగుతుందని తెలిపారు. హుస్నాబాద్ లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే హుస్నాబాద్ పట్టణంలో 150 పడకల ఆసుపత్రి కి శంఖు స్థాపన జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నుండి కరీంనగర్ హుస్నాబాద్ జనగాం వెళ్ళే రోడ్ల విస్తరణ జరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి శెట్విన్ కేంద్రాన్ని తెచ్చామని గుర్తు చేశారు. టామ్ కాం కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్ళే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తమన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందనీ అందరూ సమాచారం ఇవ్వాలని కోరారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ… తెలంగాణ పోరాట స్పూర్తి, త్యాగాలు, మన భాష, మన సంస్కృతి తెలంగాణ పండగలు చాటి చెప్పే విధంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి నీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 3 లక్షల 25 వేల కుటుంబాలకు 3 లక్షల 15 వేల కుటుంబాలు సర్వే పూర్తైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనో చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *