జర్నలిజం ముసుగులో రాబందులు..దోపిడే లక్ష్యంగా కొందరు వ్యక్తులు, సంస్థలు..జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం..నిజమైన జర్నలిస్టులజోలికొస్తే ఊరుకోం..జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం

జర్నలిజం ముసుగులో రాబందులు..దోపిడే లక్ష్యంగా కొందరు వ్యక్తులు, సంస్థలు..జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం..నిజమైన జర్నలిస్టులజోలికొస్తే ఊరుకోం..జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం

జర్నలిజం ముసుగులో రాబందులు..
దోపిడే లక్ష్యంగా కొందరు వ్యక్తులు, సంస్థలు..
జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం..
నిజమైన జర్నలిస్టుల
జోలికొస్తే ఊరుకోం..
జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
జర్నలిస్టులను రాబందులు అనే పదాన్ని వాడటం కొంత ఇబ్బంది కరమైన సందర్బం అయినప్పటికి రాబందులు అనక తప్పటం లేదు.. కొందరు జర్నలిజం ముసుగులో రాబందుల్ల వ్యవహరిస్తున్నారు.. జర్నలిజం విలువలు దిగజారుస్తున్నారు. అలాంటి వారికోసం ఇపదం తప్పదు మరి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో  జర్నలిజం ది కీలకపాత్ర.. సమాజంలో జరుగుతున్న మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలిచి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం జర్నలిస్టుల, జర్నలిజం ప్రధాన బాధ్యత. కాని జర్నలిజంలో ఇటీవల కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజురోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్ కుడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అయితే కొన్ని యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలు, వ్యక్తులు జర్నలిజాన్ని  భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్య సమాజాన్ని చెడు వైపు నడిపిస్తున్నది. జర్నలిస్టుల విలువలను దిగజార్చుతున్నాయి. ఇది సమాజానికి, పత్రిక, మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు. పత్రిక, మీడియా స్వేచ్ఛ ముసుగులో కొందరు వ్యక్తులు, సంస్థలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, హోటల్ లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులను వివిధ సంస్థలను, వ్యాపారులను, ప్రభుత్వ,  ప్రైవేటు వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. మీడియా ముసుగులో రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. ఇది నిజమైన జర్నలిజం కాదు. అలాగే ఇది జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణం ఎంత మాత్రం కాదు. ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు, యూట్యూబ్ సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే మీడియా ముసుగులో కొందరు చేస్తున్న అతికి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు సైతం కొన్ని  పరిధులులు, నియంత్రణ ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు ఆ సంస్థ లో జర్నలిస్టులు గా కొనసాగుతూ కనీస విలువలు మరిచి వ్యవహరిస్తున్నారు. తమకు పరదులు లేవు.. తమకు అడ్డూ, అదుపు లేనట్లు ఆ వ్యక్తులు.. సంస్థలు వ్యవహరించడం వారి ప్రధాన కర్తవ్యం గా మలచుకుని డబ్బు ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే ఉద్దేశంతో  ప్రధానంగా కొన్ని వ్యాపార,  వాణిజ్య సంస్థలను ఎంచుకుని దోపిడి దిగుతున్నారు. ఈ చర్యలతో విసుగుచెందిన వ్యాపారులు ఆదివారం రాత్రి ఆ యూట్యూబ్ సంస్థల వ్యక్తులు సిద్దిపేట లోని ఓ హోటల్ ను టార్గెట్ చేసి కెమెరాల తో ప్రత్యక్షమయ్యరు. దాని కంటే విరుచుకు పడ్డారు అనడం బాగుంటుందేమో. ఈ పరిస్థితుల కు విస్తుపోయిన హోటల్ యాజమాన్యం నివ్వేరపోయి.. ఇదేంటని ప్రశ్నిస్తున్న తరుణంలో ఆ యూట్యూబ్ వ్యక్తుల ఆగడాలను తట్టుకోలేక ఆ వ్యక్తుల పై ప్రత్యక్షంగా తప్పని పరిస్థితుల్లో దాడికి దిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలో జరిగిన గోడవను ఆ యూట్యూబ్ సంస్థ వ్యక్తులు కొన్ని వర్గాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు సమాచారం. ఆ యుట్యూబ్ మీడియా ఆగడాలను బరించలేకే దాడికి దిగినట్లే సమాచారం. 

జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం..
నిజమైన జర్నలిస్టుల
జోలికొస్తే ఊరుకోం..
జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం.

జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం.. ఈ వ్యవహారాన్ని తాము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా సిద్దిపేట ప్రెస్ క్లబ్,  టీయూ డబ్ల్యూజే ఐ జేయూ సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షులు కలకుంట్ల రంగాచారి మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులు, సంస్థలు జర్నలిజానికి పనికిరారు.  వారి ఆచరణను మేము ఎంత మాత్రం సమర్థించ లేము.  జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు, సంస్థల పట్ల ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. బెదిరింపులకు పాల్పడి, వ్యక్తుల సమాచారాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లేదా జర్నలిస్ట్ సంఘం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. ఎవరైనా చట్ట పరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా జర్నలిస్టు వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజంలో మంచి, చెడును బహిర్గతం చేస్తున్న నిజమైన జర్నలిస్టుల పై ఎవరు దాడులు,  బెదిరింపులకు గురిచేసిన చూస్తూ ఊరుకోం. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు హరిపురం రఘునందన్ స్వామి, దూది దుర్గారెడ్డి, బబ్బురి రాజు, నాయిని సంజీవరెడ్డి, మజ్జు, మాడూరి శ్రీరామ్, రంగదాంపల్లి శీను, అయిత శ్రీనివాస్, ఆకుల పాండురంగం, రాజు, మల్లారెడ్డి, ఇంద్రశేఖర్, బాబు, భాస్కర్, జీకురు పరమేశ్వర్, రాజాబాబు, పెద్ది ఎల్లోహర్, రామ్ రెడ్డి, సాయి గౌడ్, అంజి, గిరి, సాజిత్, సతీష్, నగేష్, ఎల్లయ్య, వెంకట్, మురళి, తదితరులు ఉన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *