బీఆర్ఎస్ కంచుకోటలో ఓట్లు ఢమాల్..

బీఆర్ఎస్ కంచుకోటలో ఓట్లు ఢమాల్..

కంచుకోటలో ఓట్లు ఢమాల్..

బీఆర్ఎస్ మెదక్ పై పట్టు తప్పిందా..
గత ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు..
ఈ సారి మూడో స్థానంలో..
సిద్దిపేటలో సైతం తగ్గిన ఓటు బ్యాంకు..
సిద్దిపేట నుండి బీఆర్ఎస్ కేవలం 2678 మెజారిటీయే..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో..
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరభావం ఎదురైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర దెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ కి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బ తిన్నదనే చెప్పాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్థానాల్లో ఓటమి చవి చూసింది, కానీ మెదక్ పార్లమెంట్ స్థానం పై బాగా ఆశలు పెట్టుకుందని,ఒక్క స్థానంలో అయిన గెలుస్తారని అందరు భావించారు.. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఓటరు మహాశాయులు బీజేపీ ని గెలిపించారు..

తెలంగాణలో అన్నీ జిల్లాలు ఒక ఎత్తు అయితే ఉమ్మడి మెదక్ మరో ఎత్తు బీఆర్ఎస్.. మెదక్ నుండి ఆరుగురు ఎమ్మెల్యే లు బీఆర్ఎస్ నుండి గెలిచారు.. అంతేకాకుండా మెదక్ పార్లమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిద్యం వహిస్తున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ అధీనంలోనే ఉంది. దీంతో మెదక్ ఎంపీ స్థానం గెలుపు తథ్యం అనుకున్నారు అందరు..కానీ అంచనాలు అన్నీ తారుమారు చేస్తూ బీజేపీ గెలిచి, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.. బీఆర్ఎస్ కు పురిటి గడ్డ, పుట్టినిల్లు అయిన సిద్దిపేట అసెంబ్లీ ఓటర్లు ఊహించని విధంగా బీజేపీ కి పట్టం కట్టారు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపులో సిద్దిపేట ప్రజల హస్తం ఉందనే చెప్పాలి.
మెదక్ ఎంపీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేట ఓటర్లు కారు గుర్తుకు వేసి విజయతీరాలకు చేర్చే వారు.కానీ ఈ సారి సిద్దిపేట ఓటర్లు  బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 2678 ఓట్లు మాత్రమే మెజారిటీ ఇచ్చారు…

పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపుకు సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ అండగా నిలుస్తుందని అందరూ భావించారు..కానీ సిద్దిపేట ఓటర్లు మాత్రం పూర్తి విరుద్ధంగా ఓట్లు వేశారు..అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు కు వచ్చిన మెజారిటీలో 5 శాతం ఓట్లు కూడా వేయలేదనే చెప్పాలి. 2004లో అప్పటి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన విజయశాంతి గెలుపులో సిద్దిపేట ఓటర్లు కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్, బీజేపీ పార్టీల కంటే బీఆర్ఎస్ కు 50 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు. నాడు సిద్దిపేట మెజార్టీతోనే ఎంపీగా విజయశాంతి గెలుపొందారు.
2009,2014,2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసిన సిద్దిపేట నుండి అత్యధిక ఓట్లు కారు గుర్తుకు పడ్డాయి. బీఆర్ఎస్ నుండి ఎవ్వరు పోటీ చేసిన వారే గెలుపొందే వారు.కానీ నిన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేట ఓటర్ల పై బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న ఆశలు అడియశాలయ్యాయి.ఈ ఎన్నికల్లో మొత్తంగా రెండవ స్థానం కాకుండా మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడంతో అంత కంగ్గుతిన్నారు.

మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల గాను ఆరుగురు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ లో ఏది ఏమైనా బీఆర్ఎస్ గెలుపు నల్లేరు పైన నడకేననీ భావించారు…..
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,  మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్యంలో  పోటా పోటీగా బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యంల కనిపించింది. ఒక్క హరీష్ రావు నియోజకవర్గంలో తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ మెజారిటీ రాలేదనే చెప్పాలి. మే 13న జరిగిన ఎన్నికల్లో మొత్తం మెదక్ పార్లమెంటు పరిధిలో 14 లక్షల పైచిలుకు ఓట్లు నమోదు అయ్యాయి. ఇందులో సిద్దిపేట తప్ప మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గ లో మూడు పార్టీల అభ్యర్థులకు కొద్దిగా అటూ, ఇటు వచ్చాయి. సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ కి కంచుకోట లాంటిది కాబట్టి ఇక్కడ ఎక్కువ మెజారిటీ వస్తే గెలుపు తథ్యం అయ్యేది. కానీ బీఆర్ ఎస్ కు ఓటు బ్యాంకు తగ్గడంతో పార్టీ ఓటమి చవిచూసింది.బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమని బిఆర్ఎస్ పెద్దలు భావించారు… కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది సిద్దిపేట నియెజకవర్గంలో  మొత్తం 1,74,969 ఓట్లు నమోదు కాగా బీఆర్ఎస్ 65,501,బిజెపి కి 62,823,కాంగ్రెస్ కు 33,174 రాగ బీఆర్ఎస్ మొదటి స్థానం, బిజెపి రెండోవ స్థానం,కాంగ్రెస్ మూడోవ స్థానం దక్కింది.కేవలం బీఆర్ఎస్ 2678 మెజార్టీ వచ్చింది.బీఆర్ఎస్, బీజేపీ మధ్య 2678 ఓట్ల తేడా మాత్రమే రావడంతో ఒక్కసారిగా కంగుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మెదక్ పార్లమెంట్  అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధి లో బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు లేకున్నా బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. టిఆర్ఎస్ నాయకులు సిద్దిపేట పై పెట్టుకున్న ఆశలు చెమ్మ గిల్లడంతో ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకున్నారు బీఆర్ఎస్ నాయకులు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *