గురిజాల అభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయండి
కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్
సిద్దిపేట టైమ్స్ వరంగల్:

గ్రామ అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నర్సంపేట మండలం గురజాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో కలిసి బుధవారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న చందర్, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— గత 15 సంవత్సరాలుగా గురిజాల గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం పోరాడుతున్నాను. ఈసారి ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే, గ్రామానికి మరిన్ని నిధులు సమకూర్చి, గురిజాలను రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా మారుస్తాను అని హామీ ఇచ్చారు. చందర్ ప్రచారం సందర్భంగా గ్రామస్తులు పలువురు ఆయనకు తమ అభ్యర్థనలు, సమస్యలను తెలియజేశారు. పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, యువత భారీగా పాల్గొనడంతో ప్రచారం ఉత్సాహంగా సాగింది.




