
యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ..
సిద్దిపేట టైమ్స్, బెజ్జoకి;
అక్రమ ఇసుక వ్యాపారం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఇసుక అక్రమ రవాణాకు నియంత్రణ లేకపోవడంతో, అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు. ఇదే అదునుగా చూసుకుని అక్రమ ఇసుక దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది. సిద్దిపేట జిల్లా
బెజ్జంకి మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా కొన సాగుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్ల లో ఇసుకను అనుమతి లేకుండా లోడు చేసుకొని అక్రమ రవాణా చేసి, సొమ్ము చేసుకుంటున్నారు కోందరు అక్రమార్కులు. సాయంత్రం 5 దాటిందంటే చాలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం పడగానే ఇసుక అక్రమ రవాణాకు తేరలేపుతున్నారు. ఉదయం 10 గంటలకు కార్యాలయాలు ప్రారంభం అయ్యే వరకు ఈ రవాణా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా అక్రమ రవాణా కు బ్రేక్ పడుతున్నది అనుకున్న.. తిరిగి యదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోడేయటం తో బోర్లలో నీటి మట్టం పడిపోయి పంటలు ఎండిపోతున్నాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ఇసుక దందాకు అడ్డుకట్టవేసి పంటలను, భూగర్భ జలాలను, వనరులను కాపాడవలసిన బాధ్యత అధికారుల పై ఉందని రైతులు కోరుకుంటున్నారు.