సిద్దిపేట నూతన సీపీ గా విజయ్ కుమార్ బాధ్యతలు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా ఎస్.యం. విజయ్ కుమార్, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు అనంతరం పోలీస్ కమిషనరేట్లో నూతన కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కి వచ్చిన నూతన కమిషనర్ కు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్లో నూతన కమిషనర్ విజయ్ కుమార్ బాధ్యత స్వీకరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సిహెచ్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఎసిపి నరసింహులు, హుస్నాబాద్ ఏసీపి సదానందం, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, పోలీస్ అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది అధికారులు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ని కలసి మొక్కలను అందజేశారు. కమిషనర్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ అందరూ కలిసి టీం వర్క్ చేయాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, సదానందం, నరసింహులు, రవీందర్, సుమన్ కుమార్, శ్రీనివాస్, మరియు ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.





